కలం, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడు (Rapthadu) జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పోలీసులు జైలుకు తరలించారు. బాలికపై దాడి అనంతరం హేమంత్ పరారయ్యాడు. అతడి సమీప అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. యువకుడిని పట్టుకునే క్రమంలో అతడు పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరపగా, హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో హేమంత్ చికిత్స పొందుతున్నాడు. తాజాగా బుధవారం అతడి ఆరోగ్యం మెరుగుపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. అనంతరం పోలీసులు అతడిని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి హేమంత్(Hemanth)పై పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న హేమంత్‌ను కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. మరోవైపు హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Also Read : తిరుపతిలో భారీ చిప్ పార్క్.. లోకేశ్ కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

