ఆలేరులో అండర్ పాస్ కష్టాలు.. అదే కారణం!

కలం, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aleru) పట్టణంలో నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ పాస్ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న అండర్ పాస్ నిర్మాణం పూర్తి కావడంతో స్థానికులతో పాటు సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికులకు రాకపోకలు సులువవుతాయని భావించారు. ప్లానింగ్ లోపంతో నిర్మించడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. అండర్ పాస్‌లోకి చేరిన వరద వెళ్లేందుకు డ్రైనేజీ పైప్ లైన్ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడమే సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు.

స్పందించి పరిష్కారం చూపితేనే..

కొద్దిపాటి వర్షం కురిసినా అండర్ పాస్‌లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోతోంది. లోతు తెలియక బైక్ నడిపేవారు, చిన్న వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో సమస్య మరీ తీవ్రంగా మారుతోందని, కాలినడకన వెళ్లేందుకు కూడా దారి ఉండటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే భయపడాల్సి వస్తోందన్నారు. నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా వెంటనే డ్రైనేజీ పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>