ప్రజలతో మమేకం కావాలి: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కలం, యాదగిరిగుట్ట: గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ప్రతిరోజూ మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు, బీఎల్‌ఏలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై మార్నింగ్ వాక్ నిర్వహించాలని తెలిపారు. మున్సిపాలిటీలలో వార్డు కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా పథకాలకు అర్హులైన నిజమైన లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుర్తించిన వివరాలను సంబంధిత గ్రామ సెక్రటరీలు, వార్డు అధికారులు, మండల కేంద్రాలలోని ఎంపీడీవోలకు అందించాలని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని బీర్ల అయిలయ్య సూచించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, అర్హులను గుర్తించడం, ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>