కలం, కరీంనగర్: అఖిల భారత యువజన సమైక్య (AIYF) కరీంనగర్ నగర14వ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. నగర నూతన కమిటీ అధ్యక్షులుగా మ్యాకల రమ, ప్రధాన కార్యదర్శిగా కాల్వ శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులుగా సంపత్ నాయక్, హేమంత్, జువ్వాజి తిరుపతి.. సహాయ కార్యదర్శిగా శ్రావణ్, బీర్లస్వాతి, కోశాధికారిగా పినమల్ల విజయభాస్కర్ లతోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులుగా 21 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోనైనదని యుగంధర్ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీని ఉద్దేశించి భావండ్ల పల్లి యుగంధర్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో ఏఐవైఎఫ్ (AIYF) బలోపేతం చేసి వాడవాడల ఎఐవైఎఫ్ కమిటీలు వేయాలని యువజన హక్కుల సాధన కోసం నగరంలోని యువతను సన్నద్ధం చేసి వారి హక్కుల సాధన లక్ష్యంగా ఉద్యమాలు చేయాలని ఆయన వారిని కోరారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు యుగంధర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: ఈటల అంటే గౌరవమే కానీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

