కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంటే తనకు గౌరవమే కానీ, నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో అది కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. హరీశ్ రావు సూచనలతో ఈటల అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల అబద్దాలు చెప్పారని, బీఆర్ఎస్ నేతల మాటలనే రాజేందర్ ప్రెస్ మీట్లో చెప్పారని మండిపడ్డారు.
ఈటల అలా చెప్పిస్తారా..
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుకు విరుద్ధంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. NDSA ఛైర్మన్ ని కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగు చేసే బాధ్యత తీసుకునేలా ఈటల ఒప్పిస్తారా.. అని ప్రశ్నించారు. అలా ఒప్పిస్తే.. మొత్తం వారికే అప్పగిస్తారని సవాల్ విసిరారు. అలాగే, ప్రాజెక్టులో అవినీతిపై చర్యలు తీసుకోవచ్చంటున్న ఈటల.. తాము సీబీఐ విచారణకు అప్పగిస్తే ఎందుకు మౌనంగా ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు.
11 నెలల్లోనే ప్రాజెక్టులో లోపాలు..
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) ప్రారంభించిన 11 నెలల్లోనే అందులోని లోపాలు బయటపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ఈఈ ఎల్అండ్టీ సంస్థకు ఇదే విషయమై లేఖ కూడా రాశారని పేర్కొన్నారు. 2022లో కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లు ఉండే గోడ కూడా కూలిపోయిందని వివరించారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన నాలుగేళ్లలో ఏకంగా బ్యారేజీకి పగుళ్లు వచ్చాయన్నారు. చివరికి మేడిగడ్డ కుప్పకూలే పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ (Revanth Reddy) పేర్కొన్నారు.
Read Also: మోటార్లకు మీటర్ల అంశం.. రైతులకు సర్కార్ గుడ్ న్యూస్
Follow Us On : WhatsApp

