ఆదిలాబాద్‌లో గంజాయి సాగు గుట్టురట్టు

కలం, ఆదిలాబాద్ : గంజాయి అక్రమ సాగుపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొటంలొద్ది(Potam Loddi) గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న 385 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.38.50 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపారు. పొటంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం గంగారాం పటేల్ వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించగా 315 గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో వ్యవసాయ పొలంలో మెస్రం నాగు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టగా 70 గంజాయి మొక్కలు లభించినట్లు తెలిపారు.

అక్రమంగా గంజాయి సాగు చేసిన ఇద్దరిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయం, రవాణా, వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, విక్రయం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే 8712659973 వాట్సప్‌ నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>