డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ‌లో మరోసారి ఏసీబీ (ACB) అధికారులు దాడులు ముమ్మ‌రం చేశారు. హైద‌రాబాద్‌లోని డీఎస్పీ భీమ్ రెడ్డి (DSP Bheem Reddy) నివాసంలో గురువారం ఉద‌యం నుంచే త‌నిఖీలు చేప‌ట్టారు. భీమ్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో జ‌గిత్యాల‌, ప‌టాన్‌చెరులో సేవ‌లు అందించిన‌ భీమ్ రెడ్డి ప్ర‌స్తుతం డీజీపీ ఆఫీస్‌లో ప‌ని చేస్తున్నారు. భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయ‌న స్నేహితులు, బంధువుల‌కు సంబంధించిన సుమారు 20 ప్ర‌దేశాల్లో ఏక కాలంలో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఈ దాడుల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>