కలం, వెబ్ డెస్క్ : గతేడాది టాలీవుడ్ కు సక్సెస్ అందించిన చిత్రాల్లో ఒకటి శంబాల. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న రిలీజై మంచి విజయం సాధించింది. ఆది చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందించింది. థియేట్రికల్ గా విజయాన్ని దక్కించుకున్న శంబాల ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ (Shambala OTT Premier) కు రెడీ అయ్యింది.
శంబాల సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ తో ఈ సినిమాను చూడొచ్చు. ‘శంబాల’ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల అందించిన బీజీఎం బలంగా నిలిచాయి.
Shambala OTT Premier | సైన్స్ కు అర్థం కాని శక్తి శాస్త్రంలో ఉంటుందనే కాన్సెప్ట్ తో దైవిక అంశాలతో కూడిన కథతో తెరకెక్కిన శంబాల ఆద్యంతం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. ఓ గ్రామంపై ఆకాశం నుంచి ఉల్క పడిన తర్వాత గ్రామస్థుల్లో మూఢ నమ్మకాలు ఏర్పడటం, ఆ మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీలో శంబాల చూడొచ్చు.


