ఏపీ లిక్కర్ స్కామ్.. మరోసారి ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. సుమారు ఐదు గంటల పాటు ఆయన్ని ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈడీ అధికారులు తనను ఏం ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. తన దగ్గర ఉన్న ఫోన్ డేటా అంతా కాపీ చేసుకున్నారని వెల్లడించారు. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కేసిరెడ్డేనని తెలిపారు. మద్యం కేసులో కేసిరెడ్డికి అన్నీ తెలుసునని.. ఇదే విషయాన్ని గతంలోనూ ఈడీ ముందర చెప్పినట్లు పేర్కొన్నారు. తనకు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ప్రమేయం లేదన్నారు. తనపై ఎవరూ ఎలాంటి టార్గెట్ చేసిన భయపడేది లేదని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>