Mobile Popup Ad
Mobile Popup Ad

నా పాలనే బెటర్ అని అమిత్ షాకు తెలుసు: జగన్

కలం, వెబ్ డెస్క్: చంద్రబాబు పరిపాలన కంటే తన పాలనే బెటర్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Amit Shah) తెలుసని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ (YS Jagan) అన్నారు. అమిత్ షా చంద్రబాబు పాలన, తన పాలన చూశారని.. ఎవరెలా చేస్తున్నారో తెలుసు కాబట్టే.. అనుభవంతో షా ఇలా చెప్పి ఉండొచ్చన్నారు. ఆయనే కాదు, ఏపీ ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందని స్పష్టం చేశారు. ఇక వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులకు మరోసారి సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి.. తమ వారిని ఇబ్బంది పెడితే.. రేపు మీరు ఇరుక్కుంటారని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన అధికారులు.. రిటైర్డ్ అయినా వదిలిపెట్టమని.. స‌ప్త‌స‌ముద్రాల అవుత‌ల ఉన్నా తీసుకువ‌స్తామని తేల్చి చెప్పారు.

ఒక్కొక్కరికి ప్రైవేట్ విమానం..

పొదుపు చేయాలని చెబుతున్న సీఎం చంద్రబాబు (Chandrababu).. జనాల చెవిలో పూలు పెడుతున్నారని వైసీపీ అధినేత మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్​ ఒక్కొక్కరు ప్రైవేట్ విమానాలు, చాపర్లు వాడుతున్నారని ఆరోపించారు. వారి కోసం విజయవాడ ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మూడేసి విమానాలు, చాపర్లు సిద్ధంగా ఉంటాయని విమర్శించారు. చంద్రబాబు చెప్పిన మాటలను కనీసం కుమారుడు, దత్త పుత్రుడు కూడా వినరని జగన్ (YS Jagan) ఎద్దేవా చేశారు.

Read Also: వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>