Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థుల‌కు కపిల్ విద్యా వారధి ట్రస్ట్ అర్హత పరీక్ష

కలం, కరీంనగర్ బ్యూరో: పదో తరగతి పూర్తి చేసుకుని ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు కపిల్ విద్యా వారధి (Kapil Vidya Varadhi) సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించారు. బుధవారం క‌రీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో పదో తరగతిలో 520 కి పైన మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ప‌రీక్ష రాసేందుకు 19 జిల్లాల నుండి 917 మంది అప్లై చేసుకోగా వీరిలో 596 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కపిల్ విద్యా వారధి (Kapil Vidya Varadhi) నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ‘కపిల్ విద్యా వారధి’ అండగా నిలవడానికి అర్హత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అర్హత పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థుల పై చదువుల కోసం, జీవితంలో నిలదొక్కుకునే వరకు కపిల్ విద్యా వారధి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

 Read Also: 59 ఏళ్ల తరువాత తీరబోతున్న కాంగ్రెస్ పార్టీ కోరిక

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>