Mobile Popup Ad
Mobile Popup Ad

గంగమ్మ జాతరలో రోజా ఫైర్.. కూటమిపై ఘాటు విమర్శలు!

కలం, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati) లో జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా మాజీ మంత్రి రోజా (Roja) తిరుపతి గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె సాంప్రదాయబద్దంగా అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రోజా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దొంగ ఈవీఎంలు లేకుండా ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూని కూటమి నేతలు నోటికొచ్చినట్లు ఎలా అవమానించారో అందరికి తెలుసు అని, శ్రీవారి లడ్డూ విషయంలో అబద్దపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక అబద్దపు ప్రచారాలు చేసిన వారిని విడిచిపెట్టం అని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>