Mobile Popup Ad
Mobile Popup Ad

‘అందరం రాజీనామా చేస్తాం’.. టీవీకే ఎమ్మెల్యేల హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: గవర్నర్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న టీవీకే (TVK) ఎమ్మెల్యేలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని, డీఎంకే–అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే.. తమ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు. తద్వారా, రాష్ట్రంలో మరింత రాజ్యాంగ సంక్షోభం వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇలాంటి హెచ్చరికలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజంగానే తెరవెనుక.. రెండు ద్రవిడ పార్టీల కూటమికి రంగం సిద్ధమవుతోందా.. అనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.

మరోసారి గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సభ్యుల జాబితా తనకు అందిస్తే.. వెంటనే ఆమోదం తెలుపుతానని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి స్పష్టం చేశారు. విజయ్ పార్టీని అడ్డుకోవాలన్నా ఉద్దేశం తనకు లేదని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మాత్రమే గవర్నర్ గా తన బాధ్యత అని కుండబద్ధలు కొట్టారు. ఒక జాతీయ మీడియా నిర్వహించిన ఫోన్ కాల్ చర్చలో పాల్గొని ఈ మేరకు అభిప్రాయం వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>