Mobile Popup Ad
Mobile Popup Ad

800 ఏళ్లనాటి శివాలయం కూల్చివేత.. కాంగ్రెస్ సర్కార్‌పై భక్తుల ఆగ్రహం

కలం, స్పోర్ట్స్ : వరంగల్ (Warangal) జిల్లాలోని శివాలయాన్ని కూల్చివేయడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన ఆలయాన్ని బుల్‌డోజర్ తో అధికారులు కూల్చి వేశారు. కాగా, ఘటనపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. శివాలయ కూల్చివేత ప్రాంతాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యె పెద్ది సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు వేర్వేరుగా సందర్శించారు.

తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆలయాన్ని కూల్చివేతపై తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలంగాణ చరిత్రకు మచ్చ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పనులు చేపట్టే క్రమంలో పురాతన శివాలయాన్ని కాల్చివేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>