Mobile Popup Ad
Mobile Popup Ad

కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

కలం, వెబ్ డెస్క్: ఉద్దేశపూర్వకంగానే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ మంగ్లీ (Singer Mangli) సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్న న్యాయస్థానం.. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డిలతో పాటు పలు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియా సంస్థలకు సిటీ సివిల్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. తనకు సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. తన పరువుకి నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. ముందస్తు ప్రాణాలికలతో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. తనపై ప్రచారం తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని.. సోషల్ మీడియాలో ఆయా లింకులను వెంటనే తొలగించాలని కోరారు. భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని కోర్టును కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>