Mobile Popup Ad
Mobile Popup Ad

వడదెబ్బతో నకిరేకల్‌లో రైతు మృతి

కలం, నకిరేకల్: వడదెబ్బతో ఓ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ప్రాణాలు విడిచిన ఘటన నకిరేకల్ (Nakrekal) పట్టణంలో సోమవారం జరిగింది. నకిరేకల్ మున్సిపాలిటి పరిధిలోని బాబాసాహెబ్ గూడెం‌కు చెందిన ఎండీ నజీర్(68) తన మూడు ఎకరాల భూమిలో వరి పంట వేశాడు. ఆదివారం వరి కోయించి, ధాన్యాన్ని మార్కెట్ రోడ్డులోని కొనుగోలు కేంద్రంలో రాశులుగా పోశాడు. అప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నజీర్.. కొనుగోలు కేంద్రం వద్దకు బైక్‌పై వెళ్లగా దిగుతున్న క్రమంలో అక్కడే పడిపోయాడు. రైతులు చూసి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నజీర్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>