కలం, వెబ్ డెస్క్ : భారత్ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయం (Puri Jagannath Temple) పై పక్షులు చక్కర్లు ( Birds Circling Temple) కొట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 12వ తేదీన జరిగిన ఘటనతో భక్తుల్లో తీవ్ర చర్చ ప్రారంభం అయింది. సాధారణంగా ఆలయ ప్రధాన శిఖరం మీదుగా పక్షులు ఎగరడం లేదా కూర్చోవడం జరగదన్న నమ్మకం ఉంది. అయితే, గతంలో ఈ ఆలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న తరువాత దేశంలో పలు కీలక సంఘటనలు జరిగాయి.
ఏప్రిల్ 13వ తేదీన పూరి జగన్నాథుడి ఆలయం (Puri Jagannath Temple) పై గద్దలు చక్కర్లు కొట్టాయి. అదే నెల 22న పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 2న పూరి ఆలయంలో అనుకోకుండా హారతి కొండెక్కింది. ఆ తరువాత నవంబర్ 10 వ తేదీన ఢిల్లీలో కారు బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం సంభవించకున్నా దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలకు పూరీ ఆయలంలో జరిగిన వాటితో భక్తులు లింకు పెడుతున్నారు.
ఈ క్రమంలో డిసెంబర్ 12న మళ్లీ పూరీ జగన్నాథుడి ఆలయ ప్రధాన శిఖరంపై అసాధారణ రీతిలో కాకులు, గద్దలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈసారి దేశంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చాలామంది భక్తలు గద్దను శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుడ దేవుడిగా భావిస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు, శాస్త్రీయ దృక్పథంలో ఆలోచించే వాళ్లు ఇది సహజ పరిణామంగా అభివర్ణిస్తున్నారు.
Read Also: సూర్యకుమార్ యాదవ్‌పై ఆకాష్ చోప్రా ఘాటు వ్యాక్యలు
Follow Us On: X(Twitter)


