epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పట్టణవాసులకు పొంగులేటి గుడ్‌న్యూస్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టణవాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Housing Scheme) అమలవుతోంది. వివిధ స్థాయిలో ఉన్న ఇండ్లకు బిల్లులు కూడా మంజూరవుతున్నాయి. అయితే పట్టణప్రాంతాల్లో ఈ పథకం ఎప్పుడు అమలవుతుంది? అన్న చర్చ సాగుతోంది. దీంతో తాజాగా పొంగులేటి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పొంగులేటి(Minister Ponguleti) పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని చెప్పారు.

‘వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇక్కడ జీ ప్లస్‌ త్రీ, జీ ప్లస్‌ ఫోర్‌ విధానంలో నిర్మిస్తాం. మధ్యతరగతి వర్గాలకూ మంజూరయ్యేలా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది’’ అని పొంగులేటి తెలిపారు. ‘స్థిరాస్తి కలిగించడం పేదలకు లక్ష్యసాధనలో తొలి అడుగు. అందుకే ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతీ దరఖాస్తుదారుడికి ఇల్లు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఈ దిశగా అవసరమైన నిధులు, భూములు, నిర్మాణ సామగ్రి సేకరించే ప్రయత్నం చేస్తున్నాం’ అని పొంగులేటి పేర్కొననారు.

జీ ప్లస్ త్రీ నిర్మాణలు

అర్బన్ ప్రాంతాల్లో గృహ అవసరం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Housing Scheme) ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ‘జీ ప్లస్ త్రీ’, ‘జీ ప్లస్ ఫోర్’ పద్ధతుల్లో నగరాల్లో ఇండ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో పట్టణప్రాంతాల్లో కూడా ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు, కూలీలు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. మధ్యతరగతి వర్గాలను కూడా గృహ యోజనల్లో చేర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు.

Read Also: ఖమ్మంలో చంద్రబాబు సతీమణికి షాకిచ్చిన పోలీసులు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>