తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు వీఐపీ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో, కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి వస్తోంది. వారికి ఇబ్బందులు తొలగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది.
డిసెంబర్ 23 నుంచి జనవరి నెలాఖరు వరకు పలు తేదీల్లో వీఐపీ దర్శనాలను TTD రద్దు చేసింది. డిసెంబర్ 23, 29, 30, జనవరి 8, 25 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది. ఆయా రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకావం ఉంది. దీంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీఐపీ దర్శనాలు దర్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులను మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఇయర్ ఎండింగ్, సంక్రాంతి సెలవుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: డర్టీ సిటీ.. చెత్త నగరంగా హైదరాబాద్
Follow Us On: Facebook


