Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖ వాసి వరల్డ్​ రికార్డ్​.. ఏడు పర్వత శిఖరాల అధిరోహణ

కలం, వెబ్​ డెస్క్​ : విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ (Anmish Varma) అద్భుతమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రపంచంలోని ఏడు ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన వ్యక్తిగా ఆయన సరికొత్త చరిత్రను లిఖించారు. ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని అన్మిష్ వర్మ కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

అన్మిష్ వర్మ (Anmish Varma) అసాధారణ పట్టుదల, సాహసం ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న కఠినమైన అగ్నిపర్వత శిఖరాలను తక్కువ కాలంలోనే అధిరోహించి, తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. ఈ ఘనతతో ఆయన సాహస క్రీడల విభాగంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఒక తెలుగు వాడు ఇంతటి క్లిష్టమైన లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>