Hidma Encounter |ఇటీవల మారేడుపల్లి, రంపచోడవరం ఎన్ కౌంటర్ పై మావోయిస్టు కేంద్రకమిటీ వికల్ప్ పేరుతో సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మా, శంకర్‌లతో పాటు దళ సభ్యులను నిరాయుధాలను చేసి అత్యంత దారుణంగా ఎన్ కౌంటర్ల పేరుతో హత్య చేశారని లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. హిడ్మా చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన సమయంలో ఏపీ పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టి.. మారేడుమిల్లిలో చంపేశారన్నారు. అలాగే, కామ్రేడ్ శంకర్ సహా మరో ఆరుగురిని రంపచోడవరంలో బూటకపు ఎన్ కౌంటర్ లో హతమార్చారని ధ్వజమెత్తారు. ఏకకాలంలో 13 మందిని చంపిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేశారని అందులో దేవ్ జీ, సంగ్రాం గానీ, లేరని పేర్కొన్నారు. హిడ్మాల్ తదితరుల సమాచారం దేవ్ జీ పోలీసులకు చెప్పలేదన్నారు.
ఈ ఆపరేషన్ ను కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించినది కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని పేర్కొన్నారు. దీనంతటికీ సూత్రధారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేయకుండా మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోనిసోడీలు ఆరోపించడం అంటే కుట్రపూరితమేనని పేర్కొన్నారు. వీరి ప్రకటనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.
Hidma Encounter | దేశాన్ని కార్పొరేట్ హిందూదేశంగా మార్చడానికి ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మావోయిస్టులను అంతం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం పూనుకుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్, బస్తర్ లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ, ఇవేమి పట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ కౌంటర్లపేరుతో నరసంహారాన్ని కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. హిడ్మాల్, శంకర్ హత్యకాండపై న్యాయవిచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షపడడంతో పాటు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా పోరాడాలని దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్టయిన 50మంది కామ్రేడ్లకు న్యాయ సహాయం అందించాలని ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలు కేంద్రకమిటీ విజ్ఞప్తి చేసింది. ప్రజలు ధృఢంగా నిలబడాలని ప్రజలను కోరింది.
Read Also: తెలంగాణ మంత్రిని టార్గెట్ చేసిన జనసైనికులు
Follow Us on: Facebook


