Mobile Popup Ad
Mobile Popup Ad

నిన్న‌ డ్ర‌గ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌.. నేడు లోక్‌స‌భ‌లో ప్ర‌త్య‌క్షం!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసులో టీడీపీ నేత‌, ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేశ్ కుమార్ (Putta Mahesh Kumar)కు పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయ‌నకు బెయిల్ ల‌భించింది. నేడు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో సైతం పాల్గొన్నారు. దీనిపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ (Rajdeep Sardesai) ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. వీకెండ్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో ఓ టీడీపీ ఎంపీపై అనుమానాలు వ్యక్తమయ్యాయ‌ని, అరెస్టు అయిన ఆయనకు బెయిల్ లభించగా, ఈరోజు మళ్లీ పార్లమెంట్‌కు హాజరయ్యార‌ని పేర్కొన్నారు.

సాధారణ పౌరుడికి ఇంత త్వరగా ఇలాంటి సడలింపులు లభిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ‌ని రాజ్‌దీప్ అభిప్రాయ‌ప‌డ్డారు. డ్ర‌గ్స్‌ను స‌హించేదే లేద‌న్న ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అధికార వర్గాల్లో డ్రగ్స్ వ్యాప్తి విస్తృతంగా జరుగుతున్నట్టు షాకింగ్ కథనాలు వినిపిస్తున్నాయ‌ని ఆరోపించారు. మ‌రోవైపు టీడీపీ ఫామ్‌హౌస్ వ్య‌వ‌హారంపై వివ‌రణ ఇవ్వాల‌ని పుట్టా మ‌హేశ్‌ను ఆదేశించింది. అంత వ‌ర‌కు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌కూడ‌ద‌ని పేర్కొంది. ఇక మ‌హేశ్ కుమార్ తాను కేవ‌లం డిన్న‌ర్‌కు వెళ్లాన‌ని, త‌న‌కు ఎలాంటి దుర‌ల‌వాట్లు లేవ‌ని, త‌న‌పై వ‌స్తున్న దుష్ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఓ వీడియో విడుద‌ల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>