ఏపీలోని వైసీపీ ఆధీనంలో ఉన్న మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో నెల్లూరు మేయర్(Nellore Mayor) పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 18న నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలు వైసీపీ గెలచుకున్నది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికైన కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం టీడీపీకి మద్దతు ఇచ్చే వారి సంఖ్య 42కు చేరుకున్నది. దీంతో కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలని కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానం తేదీని ప్రకటించారు.
ఈ మేయర్(Nellore Mayor) పదవిని సులువుగా దక్కించుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మేయర్ స్రవంతి మాత్రం తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తోంది. టీడీపీ నేతలు తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేశారని చెబుతోంది. ఈ చర్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. ఓ ఎమ్మెల్యేనే ఈ కుట్రను చేశారని చెబుతున్నారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. అప్పట్లో స్రవంతిని మేయర్‌గా ఎన్నుకున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టిన అనంతరం మేయర్ స్రవంతి ఈ పరీక్షలో నెగ్గకపోతే ఆమె పదవి నుంచి వైదొలగవలిసి ఉంటుంది. తర్వాత కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
Read Also: ఏపీకన్నా తెలంగాణ బెటర్
Follow Us on: Facebook


