ఆదివాసీ హత్య కేసును ఛేదించిన పోలీసులు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కరకగూడెంలో గత నెల జరిగిన హత్య కేసును సీఐ వెంకటేశ్వర రావు, పోలీస్ సిబ్బంది ఛేదించారు. ఫిబ్రవరి 28న కరకగూడెంలోని అశ్వపురంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి వెంకటేశ్వర్లు (ఆదివాసీ) నిద్రిస్తుండగా, అర్ధరాత్రి దుండగులు హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే వజ్జ భీమరాజు, మడివి మంగయ్య, మడివి నందయ్యలు వెంకటేశ్వర్లును హత్య చేయించారు. బాలాజీ, లక్ష్మయ్యలకు 50 వేల సుపారీ ఇచ్చి చంపించారు. పోలీసులు (Police) నిందితులతోపాటు సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>