epaper
Thursday, March 5, 2026
epaper

క‌విత తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌.. ఏపీలో స్వాగ‌తం ప‌లుకుతూ ఫ్లెక్సీలు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ క‌విత (Kavitha) నేడు తిరుమ‌ల (Tirumala) ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కుటుంబ‌స‌మేతంగా వెళ్లారు. మ‌రికొద్ది సేప‌ట్లో తిరుమ‌ల‌కు చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలోని రేణికుంట‌, శ్రీకాళ‌హ‌స్తిలో క‌విత‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ప‌లువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు బియ్య‌పు మ‌ధుసూధ‌న్ రెడ్డితో పాటు మ‌రికొంద‌రు క‌విత‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాహ‌న‌దాలు ఈ ఫ్లెక్సీల‌ను ఆస‌క్తిక‌రంగా తిల‌కిస్తున్నారు.

ఇక ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌విత కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండ‌పైకి వెళ్ల‌నున్నారు. శుక్ర‌వారం ఉద‌యం స్వామి వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. అదే రోజు హైద‌రాబాద్‌కు తిరిగి రానున్నారు. కవిత (Kavitha) కుటుంబంతో పాటు పలువురు జాగృతి నాయకులు కూడా తిరుమలకు వెళ్లారు.

Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!