epaper
Thursday, March 5, 2026
epaper

భ‌ట్టి కుమారుడి వివాహం.. హాజ‌రైన సినీ, రాజ‌కీయ ప్రముఖులు

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) కుమారుడు సూర్య‌ విక్ర‌మాదిత్య‌ వివాహ వేడుక‌ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల నుంచి రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌స్తున్నారు. నూత‌న వ‌ధూ వ‌రుల‌ను ఆశీర్వ‌దించి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. పార్టీల‌కు అతీతంగా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది నాయ‌కులు రావ‌డం విశేషం.

వివాహానికి హాజ‌రైన రాజ‌కీయ నేత‌లు వీరే…

ఈ వివాహ వేడుక‌కు తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల‌తో పాటు, ఏపీ టీడీపీ ఎంపీ మాగుంట, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఏపీ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఇక సినీ ప్ర‌ముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కుటుంబం, మోహ‌న్ బాబు, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామలా దేవి, నిర్మాత‌ అల్లు అరవింద్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!