కలం, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, సోనూసూద్ (Sonu Sood) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఏ దేశానికి చెందిన వారైనా సరే, ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి వల్ల ఇబ్బందులు పడుతుంటే వారికి ఉచితంగా వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
తమ స్వదేశాలకు చేరుకునే వరకు ప్రయాణికులకు దుబాయ్‌లో సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తామని సోనూసూద్ (Sonu Sood) తెలిపారు. ఈ సాయం పొందడానికి ఎటువంటి నిబంధనలు లేదా జాతీయతతో సంబంధం లేదని, కేవలం మానవత్వమే ప్రాతిపదిక అని ఆయన పేర్కొన్నారు. సాయం కావాల్సిన వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించాలని, తన టీమ్ వెంటనే స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు.

