epaper
Wednesday, March 4, 2026
epaper

ఇరాన్ యుద్ధనౌకపై దాడి మా పనే : అమెరికా

కలం, వెబ్​ డెస్క్​: శ్రీలంక తీరంలో ఇరాన్​ యుద్ధనౌక ఐరిస్​ దేనా(IRIS Dena)పై దాడి చేసింది తామేనని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు యూఎస్​ డిఫెన్స్​ సెక్రెటరీ పీట్​ హెగ్సెత్ బుధవారం సాయంత్రం వెల్లడించారు. సబ్​మెరైన్​ నుంచి టోర్పడోను వదిలి ఇరాన్​ వార్​షిప్​ను ముంచేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సముద్ర జలాలు కావడంతో బాంబులతో దాడి వంటివి చేయకుండా కేవలం ముంచేసినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.

తీరానికి మృతదేహాలు : శ్రీలంక

కాగా, ఈ ఉదయం శ్రీలంకలోని గాలె పట్టణానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో వెళుతున్న ఐరిస్​ దేనా వార్​షిప్​ మునిగిపోవడం తెలిసిందే. ఈ ఘటనలో 101 మంది గల్లంతు కాగా, 78 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. మిగిలినవాళ్ల కోసం సెర్చింగ్​ జరుపుతోంది. ఈ క్రమంలో తీరానికి కొన్ని మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు శ్రీలంక ప్రకటించింది.

విశాఖపట్నం నుంచి వెళుతూ..

మరోవైపు మునిగిపోయిన ఇరాన్ నౌక (IRIS Dena) ఇటీవల విశాఖపట్నం వద్ద బంగాళాఖాతంలో నిర్వహించిన మిలాన్​ 2026 మల్టీనేషనల్​ నేవల్​ విన్యాసాల్లో పాల్గొంది. తిరిగి స్వదేశానికి వెళుతుండగా, భారత్​–శ్రీలంక మధ్య హిందూ మహాసముద్రంలో ఈ నౌకపై దాడి జరిగింది.

Read Also: బాబర్ అజామ్‌కు షాక్.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌కు దూరం!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!