epaper
Wednesday, March 4, 2026
epaper

టాక్సిక్ మూవీ విడుద‌ల వాయిదా.. కొత్త డేట్ ప్ర‌క‌టించిన టీం!

క‌లం, వెబ్ డెస్క్‌: కేజీఎఫ్ స్టార్ య‌శ్ న‌టించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ (Toxic Movie). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి 19న సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టీం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డిన‌ట్లు మూవీ టీం ప్ర‌క‌టించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ రూపొందించిన ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందించారు. దీన్ని ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీర్చి దిద్దారు. మార్చి 19న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా మిడిల్‌ ఈస్ట్ ఉద్రిక్త‌త‌లు సినిమాను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల నిర్మాతలు సినిమా విడుదల తేదీని జూన్ 4, 2026కి మార్చేశారు. అభిమానులు అర్థం చేసుకొని స‌హ‌క‌రించాల‌ని నిర్మాత‌లు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!