అమ్మవారి ఆభరణాలు తలపై మోసిన ఎమ్మెల్యే ఏలేటి!

కలం, దిలావర్పూర్ : అడెల్లి శ్రీ మహా పోచమ్మతల్లి గంగనీళ్ల జాతరలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆదివారం సాంగ్వి గ్రామ గోదావరి నదిలో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలు దిలావర్పూర్ మీదుగా అడెల్లి ఆలయానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఆయన శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంగా అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకుని పాదయాత్రలో పాల్గొన్నారు.

అమ్మవారి ఆభరణాలను తలపై మోస్తూ శోభాయాత్రలో ముందుకు సాగి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన భక్తిని చాటుకున్నారు. అడెల్లి పోచమ్మతల్లి గంగనీళ్ల జాతరలో భాగంగా నిర్వహించిన ఈ ఆభరణాల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణ, మేళతాళాల మధ్య శోభాయాత్ర భక్తిమయంగా సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.

Also Read : ప్రధాని మోదీ తప్పించుకోలేరు: రాహుల్ గాంధీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>