హైద‌రాబాద్‌లో మ‌రో భారీ డిజిట‌ల్ మోసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో మ‌రో డిజిట‌ల్ అరెస్ట్ ఉదంతం (Digital Arrest Scam) వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రు కేటుగాళ్లు రిటైర్డ్ ఉద్యోగిని డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి రూ.29.17 ల‌క్ష‌లు దోచుకున్నారు. బాధితుడు సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో వారు కేసు న‌మోదు చేసుకొని, ద‌ర్యాప్తు చేసి, ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివ‌రాల‌ను పోలీసులు ఆదివారం వెల్ల‌డించారు. న‌గ‌రానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఇద్ద‌రు వ్య‌క్తులు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీస్‌, సీబీఐ, ఈడీ అధికారుల పేర్ల‌తో స‌ద‌రు వ్య‌క్తిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. రూ.6.8 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరికిస్తామంటూ బాధితుడిని భ‌య‌పెట్టారు.

వెరిఫికేష‌న్ పేరుతో అత‌డితో పాటు అత‌డి కూతు వ‌ద్ద నుంచి రూ.29.17 ల‌క్ష‌ల న‌గ‌దును త‌మ ఖాతాల్లోకి బ‌దిలీ చేయించుకున్నారు. ఆ త‌ర్వాత బాధితుడు ఇదంతా మోస‌మ‌ని గ్ర‌హించి సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అమీర్‌పేటకు చెందిన మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్, అహ్మద్ నజీబ్ ఉద్దీన్ అనే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. బెంగుళూరుకు చెందిన స‌చిన అనే మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సొమ్మును నిందితులు ఇత‌ర ఖాతాల‌కు మ‌ళ్లించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. చెక్కుల ద్వారా నగదు విత్‌డ్రా చేసి ఇతర ఖాతాల్లో జమ చేసుకున్నారు. మ‌రో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న ఇద్ద‌రిని విచారించి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>