కలం, వెబ్ డెస్క్ : ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తూ వైసీపీ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ (YSRCP Petition) దాఖలు చేసింది. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాఖలుకు తగిన సమయం ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించి డిస్మిస్ చేసింది.
ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక విషయాలు తెలిపారు. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని, రేపటి నుంచి సమర్పించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉన్నందున ఈ దశలో నామినేషన్ల గడువు పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ అందించిన వివరాలతో ఏకీభవించిన హైకోర్టు.. వైసీపీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్(YSRCP Petition)ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read : ప్రధాని మోదీ తప్పించుకోలేరు: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

