కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో సుమారు ఏడు వందల ఏళ్ల నాటి పురాతన చెన్నకేశవ స్వామి విగ్రహం లభ్యమవ్వడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐదు అడుగుల ఎత్తులో ఉన్న ఈ భారీ విగ్రహం నాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈ విగ్రహంపై ఉన్న చెక్కడాలు, ఆకృతిని పరిశీలిస్తే ఇది ప్రముఖ హోయసల శిల్పకళా రీతిని పోలి ఉండటం విశేషం. సాధారణంగా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ కళా నైపుణ్యం మన తెలంగాణ ప్రాంతంలో లభ్యం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి ఉన్న పురాతన సాంస్కృతిక సంబంధాలను, నాటి రాజుల వైభవాన్ని ఈ ఆవిష్కరణ మరోసారి ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు.

