కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader)గా అయతొల్లా అలీ ఖమెనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమెనీ (Mojtaba Khamenei)ని ఎంపిక చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మొజ్తాబాను ఎన్నుకోవాలని ఆ దేశ మత పెద్దలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ పాలనలో నిర్వహించిన కార్యకలాపాల్లో హుసైనీ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక పదవిలో పని చేయలేదు. కానీ తెర వెనుక ఉంటూ అంతా నడిపించాడు. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రతీది ఇతని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని సమాచారం. దేశానికి అలీ ఖమెనీ తరహా నాయకత్వం అవసరమనే అభిప్రాయంతోనే మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

