epaper
Tuesday, March 3, 2026
epaper

ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ.. ముగ్గురికీ సంబంధమేంటో తెలుసా?

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు, ఇరాన్​ సుప్రీం అయతొల్లా ఖమేనీ ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి కేంద్ర బిందువులు. ఇదే కాదు, వీళ్ల ముగ్గురి మధ్య మరో కామన్​ పాయింట్​ కూడా ఉంది(Eclipse). అది ఇప్పుడు సోషల్​ మీడియాను షేక్​ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే..

అమెరికాకు చెందిన ప్రొఫెషనల్​ జ్యోతిష్కుడు క్రిస్​ బ్రెన్నన్​ మంగళవారం తన ‘ఎక్స్​’ ఖాతాలో ఒక ట్వీట్​ పోస్ట్​ చేశారు. అందులో ఇలా ఉంది..

‘‘ప్రస్తుత యుద్ధానికి కారణమైన ముగ్గురు నాయకులూ గ్రహణం రోజునే పుట్టారు.

  • ట్రంప్​ : జూన్​ 14, 1946 – చంద్ర గ్రహణం
  • నెతన్యాహు : అక్టోబర్​ 21, 1949– సూర్య గ్రహణం
  • ఖమేనీ : ఏప్రిల్​ 19, 1939– సూర్య గ్రహణం

వీళ్లలో ఖమేనీ మరణం తర్వాత ఈ రోజు మరో గ్రహణం జరగనుంది’’ అని ట్వీట్​ చేశారు.

అంతేకాదు, దీన్ని వెరిఫై చేయమని గ్రోక్​ను అడిగారు. ఆశ్చర్యకరంగా గ్రోక్ సైతం ఇదే విషయాన్ని నిర్దారించింది. ఆ ముగ్గురు నాయకులూ గ్రహణం రోజే పుట్టారని తేల్చింది(Eclipse). దీంతో ఈ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరలైంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!