epaper
Tuesday, March 3, 2026
epaper

మూసీ నదిలోనే బిల్డింగ్ కడుతుంటే హైడ్రా ఎక్కడుంది : కవిత

కలం, డెస్క్ : మూసీ నదిలోనే భారీ బిల్డింగ్ కడుతుంటే హైడ్రాకు (Hydraa) కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha). మూసీ నదిలో ఓ బిల్డింగ్ కడుతున్నారని.. దాన్ని కూల్చేయాలంటూ జాగృతి ఆధ్వర్యంలో అక్కడే కూర్చుని నిరసన చేపట్టారు కవిత. పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే హైడ్రాకు మాత్రం ఇలాంటి పెద్ద వాళ్ల బిల్డింగులు కనిపించట్లేదా అంటూ కవిత  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుత్బుల్లాపూర్ లో పేదల ఇండ్లను నేలమట్టం చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇండ్లను భూస్థాపితం చేశారు. కానీ మూసీలో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు, ప్రభుత్వానికి కనిపించట్లేదు’ అంటూ విమర్శించారు కవిత.

తాను రంగనాథ్ (AV Ranganath) కు ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెబుతున్నారని.. ఆయన బుల్డోజర్లు తెచ్చే దాకా ఇక్కడే కూర్చుంటామని కవిత చెప్పారు. ‘జాగృతి ఆధ్వర్యంలో జనం బాటలో భాగంగా చెరువు, కుంటలను కబ్జా చేసి కట్టిన బిల్డింగుల వివరాలతో ఇప్పటికే కంప్లయింట్ ఇచ్చాం. కానీ ఇప్పటి దాకా చర్యలు తీసుకోలేదు. కానీ వెలుగుమట్లలో పేదల ఇండ్లను చాలా స్పీడ్ గా కూల్చేశారు. త్వరలోనే అక్కడకు కూడా వెళ్తాం. హైదరాబాద్ లోని మధు రిడ్జ్ అపార్టుమెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ 20 ఏళ్ల క్రితం అపార్టుమెంట్ కొనుక్కున్నారు. అలాంటి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు గానీ.. ఇప్పుడిప్పుడే మూసీలో కడుతున్న బిల్డింగ్ ను మాత్రం కూల్చట్లేదు. మాకు ప్రైవేట్ వాళ్లతో పంచాయతీ లేదు. ప్రభుత్వంతోనే మాకు పంచాయతీ. ఈ బిల్డింగ్ కు బీఆర్ ఎస్ హయాంలో పర్మిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ఆరు నెలల దాకా నిర్మాణాలను ఆపేశారు. కానీ లంచాలు తీసుకుని మళ్లీ పర్మిషన్లు ఇచ్చారు. ఈ నిర్మాణాలను కచ్చితంగా అడ్డుకుంటాం. అందరికీ ఒకే న్యాయం ఉండాలనేదే మా నినాదం. కచ్చితంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటాం. ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చేదాకా వదిలిపెట్టం’ అంటూ కవిత (Kavitha) తేల్చి చెప్పారు.

Read Also: సీఎం vs సివిల్ సర్వెంట్స్.. సమస్య ఎటు దారితీయనుంది?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!