epaper
Tuesday, March 3, 2026
epaper

ఆ యాంగిల్స్‌లో ఫొటోలు తీయకండి.. కాంతార నటి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: కాంతార, తమ్ముడు సినిమాలతో గుర్తింపు పొందిన నటి సప్తమి గౌడ (Sapthami Gowda) సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో కెమెరామెన్లు నటీమణుల శరీర భాగాలను జూమ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హీరోయిన్లను రెచ్చగొట్టే కోణాల్లో చిత్రీకరించడం ఆపాలని కోరింది. ఫోటోగ్రాఫర్లు తమ పద్ధతిని మార్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా నోట్‌ను విడుదల చేశారు.

బహిరంగ కార్యక్రమాల్లో తీసిన అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంపై ఆమె మండిపడ్డారు. ‘‘బహిరంగ కార్యక్రమాల్లో హీరోయిన్స్ (Actresses) వీడియోలు, ఫోటోలు పదేపదే అనుచిత కోణాల్లో తీస్తున్నారు. మా పనిపై కంటే మా శరీరాలపై దృష్టి సారించేలా అనవసరమైన జూమ్‌లతో వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు చేసే ఈ ప్రవర్తన అంగీకరించలేనిది’’ అని ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇటీవల తాను హాజరైన కార్యక్రమాల్లో ఫొటోగ్రాఫర్లు ప్రవర్తించిన తీరుపై సప్తమి గౌడ (Sapthami Gowda) తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా బాలీవుడ్, టాలీవుడ్ నటి అయేషా ఖాన్ సైతం ఇదే విషయంపై స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో తనను వెనుక నుండి చిత్రీకరించవద్దని, అలా చేస్తే సహించేది లేదని ఆమె ఫోటోగ్రాఫర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సప్తమి గౌడ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: రామ్ చరణ్‌‌కు ఆ లక్షణం చిరంజీవి నుంచే వచ్చింది : బుచ్చిబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!