కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌లోని (Iran) మినాబ్ నగరంలో బాలికల సమాధుల దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా-ఇజ్రాయెల్ (US – Israel) దళాలు జరిపిన వైమానిక దాడుల్లో బాలికల ప్రాథమిక పాఠశాల (షజరే తయ్యెబా స్కూల్) ధ్వంసమైంది. ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడిలో మొత్తం 180 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 165 మంది చిన్నారులు (బాలికలు) ఉండటం తీవ్ర విషాదం రేపింది.
ఈ పసి మొగ్గలందరినీ ఒకే చోట ఖననం (Buried) చేసేందుకు సిద్ధం చేసిన సామూహిక సమాధుల ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ (Iran Minister Abbas) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో వందలాది గోతులు వరుసగా తీసి ఉండటం, ప్రతి గుంత వద్ద తెల్లటి మార్కింగ్‌లు ఉండటం చూస్తుంటే ఆ ప్రాంతం ఎంతటి విషాదంలో ఉందో అర్థమవుతుంది. ‘గజాతో మొదలైన మారణహోమం మినాబ్ వరకు కొనసాగుతోంది, పసిపిల్లల శరీరాలు ముక్కలైపోయాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, యునెస్కో (UNESCO) కూడా విద్యాసంస్థలపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.
Read Also: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. వాటిపైనే చర్చ
Follow Us On : WhatsApp

