epaper
Tuesday, March 3, 2026
epaper

ప్రధాని మోదీ మరో రికార్డు.. ఈ సారి ఎందులో !

కలం, వెబ్ డెస్క్​ : సోషల్​ మీడియా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరో రికార్డును నెలకొల్పారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌లో మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్ల (3 కోట్లు) మార్కును దాటడంతో, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన తొలి రాజకీయ నేతగా ఆయన నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలలో మరెవరికీ లేనంత భారీ ఫాలోయింగ్‌తో మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో రెండో స్థానంలో నిలవగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump)  పోలిస్తే ప్రధాని మోదీకి (Narendra Modi) ఏడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. సోషల్ మీడియా వేదికలను ప్రజలతో మమేకమవ్వడానికి సమర్థవంతంగా వినియోగించుకోవడంలో మోదీ తనదైన ముద్ర వేస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన వీడియోలకు వస్తున్న ఆదరణ ఈ రికార్డుతో మరోసారి స్పష్టమైంది. ఇటీవల మోదీ తన ఇన్​ స్టాగ్రామ్​ లో 100 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన రాజకీయ నేతగా రికార్డు సృష్టించిన విషయం విధితమే.

Read Also: ప్రధాని మౌనం దేశానికి నష్టం : రాహుల్​ గాంధీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!