epaper
Monday, March 2, 2026
epaper

ఇరాన్ న్యూక్లియర్ సైట్‌పై దాడులు

కలం, డెస్క్ : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా వార్ (Iran Israel War) పీక్స్ కు వెళ్లిపోతోంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్-అమెరికా కలిసి పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్ నటాన్జ్ న్యూక్లియర్ సైట్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపినట్టు ఆ దేశం ధృవీకరించింది. ఈ విషయాన్ని ఐఏఈఏకు తెలిపింది. న్యూక్లియర్ సైట్ నుంచి పెద్ద ఎత్తున రేడియేషన్ వెలువడుతోంది. రేడియేషన్ ఇలాగే కంటిన్యూగా లీక్ అయితే.. చాలా నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుందని ఐఏఈఏ హెచ్చరించింది. దీనిపై మాత్రం ఇరాన్ స్పందించలేదు. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ను భూస్థాపితం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. అందులో భాగంగానే అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఈ దాడులు జరిపటనట్టు సమాచారం.

Read Also: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ మృతి!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!