epaper
Monday, March 2, 2026
epaper

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో కారు బీభత్సం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎల్‌బీనగర్ (LB Nagar) పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై సోమవారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకెళ్లిన ఓ కారు ముందుగా లారీని, అనంతరం డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు అప్రమత్తమై వెంటనే కిందికి దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కారులోని వారు మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also: డీసీసీ మీటింగ్‌లో మంత్రులకు అవమానం..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!