epaper
Monday, March 2, 2026
epaper

నేడు తుమ్మెనపేటకు విజయ్-రష్మిక దంపతులు

కలం, సినిమా : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న( Rashmika Mandanna) దంపతులు నేడు వారి స్వగ్రామం నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బలమూరు మండలం  తుమ్మెనపేట (Thummanpet)కు రానున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయ్ దేవరకొండకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. వ్రతానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు హాజరుకానున్నారు. అనంతరం ప్రత్యేక రిసెప్షన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో గ్రామంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అతిథుల స్వాగతం కోసం ప్రత్యేక అలంకరణలు, విందు ఏర్పాట్లు చేశారు. విజయ్-రష్మిక జంట రాకతో తుమ్మెనపేటలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశముండటంతో స్థానిక అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!