కలం, స్పోర్ట్స్ బ్యూరో: ఒకే ఒక్కడు..! పర్ఫార్మెన్స్ బాలేదన్నారు.. టీ20కి పనికిరాడన్నారు..! ఎందుకు స్క్వాడ్‌లోకి తీసుకున్నారని దుమ్మెత్తిపోశారు!! కానీ, ఆ ఒక్కడే.. టీమిండియాకు నేనున్నానంటూ నిలబడ్డాడు. సెమీస్ ఆశలు సన్నగిల్లిన టీమ్‌ను ముందుండి నడిపించాడు. ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. టీమిండియాను సగర్వంగా సెమీస్‌కు చేర్చి.. తానేంటో బ్యాట్‌తో చూపించాడు. ఆ ఒక్కడే సంజూ శాంసన్! కోల్‌కతా వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వికెట్ కీపర్ సంజూ తాండవం చేశాడు. తొలి ఓవర్ నుంచి మొదలు చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉండి.. పరుగుల వరద పారించాడు. తనకు తోడుగా వచ్చిన టీమ్మేట్స్ ఒకరొకరుగా వెనుదిరుగుతున్నా ఎక్కడా తడబడలేదు. 50 బంతుల్లో 4 సిక్సర్లు, 12 బౌండరీలతో.. 97 రన్స్ చేసి టీమిండియాను సెమీస్‌కు చేర్చాడు. ఇక, ఈ నెల 5న ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా సెమీ ఫైనల్లో తలపడనుంది. స్వదేశంలో ఏ టీమ్ కూడా టీ20 వరల్డ్ కప్ కొట్టిన చరిత్ర లేదు. ఇప్పుడు టీమిండియాకు ఆ హిస్టరీని సొంతం చేసుకునే చాన్స్ రెండడుగుల దూరంలో ఉంది. సెమీస్‌లో గెలిస్తే.. మార్చి 8న ఫైనల్!!
కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: గల్ఫ్ లో హై టెన్షన్.. తెలంగాణ వలసజీవులు బిక్కుబిక్కు
Follow Us On: Youtube

