కలం, నాగార్జునసాగర్: ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నేడు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పర్యటించనున్నారు. సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఖర్గే మధ్యాహ్నం 12:30 గంటలకు న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే గడిపి హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగుపయనమవుతారు. సాయంత్రం 6:15 గంటలకు హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో వెళ్తారు. మల్లికార్జున ఖర్గే పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

