కలం, జనగామ : తెలంగాణ రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్, షీ టీమ్ (SHE Team) కార్యాలయాలను ఆదివారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy), వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. బాధితులకు భరోసా.. లైంగిక వేధింపులు, గృహ హింస, పోక్సో (POCSO) కేసుల బాధితులకు ఒకే చోట వైద్య, న్యాయ మానసిక సహాయం అందించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేసే షీ టీమ్స్ కోసం అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక కార్యాలయాన్ని ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

