epaper
Sunday, March 1, 2026
epaper

ఇరాన్​ మసీదుపై ఎగిరిన ఎర్ర జెండా.. ఎందుకంటే?

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా, ఇజ్రాయెల్​ దాడులతో అతలాకుతలమవుతున్న ఇరాన్​ పగతో రగలిపోతోంది. శత్రువులపై అంతులేని కోపంతో ఉంది. ఈ క్రమంలో ఇరాన్​లోని పురాతన నగరమైన కోమ్​లోని జమ్​కరన్​ (Jamkaran Mosque) మసీదుపై ఆదివారం ఎర్ర జెండా ఎగిరింది.

ఈ మసీదు ఇరానీయుల​ సంస్కృతికి, మతానికి ప్రతీకగా భావిస్తారు. దీనిపై రెడ్​ ఫ్లాగ్​ ఎగరేయడం అంటే శత్రువులకు హెచ్చరిక పంపడం లాంటిదే. ఎందుకంటే తమకు తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం సూచనగా ఈ రెడ్​ ఫ్లాగ్​ ఎగరేస్తారు. దీన్ని న్యాయం, పగకు సింబల్​గా భావిస్తారు. ప్రస్తుతం ఎర్ర జెండా ఎగరేయడం ఖమేనీ మద్దతుదారుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని సూచిస్తున్నట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.

కాగా, శనివారం అమెరికా–ఇజ్రాయెల్​ సంయుక్త దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు, ఖమేనీ మద్దతుదారులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్​ నాయకులు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఇజ్రాయెల్​ పీఎం బెంజిమన్​ నెతన్యాహును హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో (Jamkaran Mosque) ఇరానియన్ల పగ, ప్రతీకారాన్ని సూచించే ఎర్ర జెండా ఎగరడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!