epaper
Monday, March 2, 2026
epaper

రంగనాథ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం: హైకోర్టు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌(AV Ranganath)పై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ గనక నేరుగా విచారణకు హాజరు కాకపోతే ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని తెలిపింది. బతుకమ్మ కుంటపై కోర్టు స్టేటస్ కో ఇచ్చినా హైడ్రా(Hydraa) మాత్రం ఆ చెరువు దగ్గర పునరుద్ధరణ పనులు చేపట్టింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆర్డర్లను ఉల్లంఘిస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తారా? అంటూ మండిపడింది. గురువారం బతుకమ్మ కుంట పిటిషన్లపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా కోర్టు హైడ్రా తీరును తప్పుపట్టింది.

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బతుకమ్మకుంట చెరువు పరిరక్షణకు సంబంధించిన పిటిషన్‌లు, కాంటెంప్ట్ కేసులు దాఖలయ్యాయి. ఏప్రిల్ 23న హైకోర్టు (స్టేటస్ కో) యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా మాత్రం కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా చెరువు పునరుద్ధరణ పేరుతో భారీగా మట్టిని డంప్ చేసింది.

విచారణలో రంగనాథ్(AV Ranganath) తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. చెరువు నుంచి టన్నుల బయో-వేస్ట్, డెబ్రీస్ తొలగించి వరదలు నివారిస్తున్నామంటూ కానీ కోర్టు మాత్రం హైడ్రా తీరును తప్పుపట్టింది. హైడ్రాకు పనులు చేసే అధికారం లేదు. చెరువులు కబ్జా నుంచి కాపాడటం మాత్రమే హైడ్రా పని. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ,సీవరేజ్ బోర్డు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లు చేసే పనిని హైడ్రా ఎందుకు చేస్తోంది? అంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైడ్రా ఏర్పాటుకు చేసే అధికారం ఎక్కడుంచి వచ్చింది?” అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

Read Also: 5 లక్షల కోట్ల స్కామ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఉత్తమ్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!