epaper
Monday, March 2, 2026
epaper

వేట్లపాలెం మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు : సీఎం చంద్రబాబు

కలం, వెబ్​ డెస్క్​: వేట్లపాలెం బాణ సంచా తయారీ కేంద్రం పేలుడు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి (Chandrababu) చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన కాకినాడ జిల్లా కేంద్రం చేరుకున్నారు. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వాళ్ల కుటుంబసభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువును బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడారు. బాధితుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. బాణా సంచా తయారీ కేంద్రాల పర్యవేక్షణలో విఫలమయ్యారని డీఎస్సీ, జిల్లా ఫైర్​ ఆఫీసర్​, జిల్లా లేబర్​ ఆఫీసర్​, ఆర్డీవోలను సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించారు. బాణా సంచా తయారీ కేంద్రం ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్ఘటనకు కారణమైన నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి, బాధిత కుటుంబాలకు అందజేస్తామని ప్రకటించారు. అనుమతి లేకుండా బాణ సంచా తయారుచేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!