కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలని ప్రముఖ ప్రవచన కర్త, పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) డిమాండ్ చేశారు. తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ పేరు ఉండాలని అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రారంభమైన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలని కోరారు. ‘ఆంధ్రప్రదేశ్’ అనేది తెలుగు పదం కాదన్నారు. తమిళనాడు తరహాలో.. తెలుగు భాష, సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘తెలుగు నాడు’(Telugu Nadu) అని పేరు పెట్టాలని సూచించారు.
ఇది తెలుగువాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని గరికిపాటి (Garikipati) అన్నారు. ఇటీవలే కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సమావేశాల్లో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Also: వేట్లపాలెం దుర్ఘటన కలచివేసింది : ప్రధాని మోదీ
Follow Us On: Instagram

