epaper
Sunday, March 1, 2026
epaper

పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇదొక్కటే దారి!

క‌లం, వెబ్ డెస్క్‌: టీ 20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) పాకిస్థాన్ (Pak Team) సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక (Sri Lanka)పై భారీ విజయం సాధించడం తప్ప మరో మార్గం లేదు. ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌పై ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో పాకిస్థాన్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, కేవలం గెలిస్తే సరిపోదు, నెట్ రన్ రేట్ పరంగా న్యూజిలాండ్‌ను అధిగమించాలంటే పాక్ ముందు కఠినమైన సమీకరణాలు ఉన్నాయి. శ్రీలంకతో జరగబోయే కీలక పోరులో పాకిస్థాన్ ముందు రెండు కీలక లక్ష్యాలున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్థాన్ కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. రెండవసారి బ్యాటింగ్ చేస్తే అంటే ఛేజింగ్‌కి వస్తే శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని సుమారు 13.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.

గ్రూప్ 2 సూపర్ ఎయిట్ దశలో ఇంగ్లాండ్ వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్ 3 పాయింట్లతో ఉండగా, పాకిస్థాన్ ప్రస్తుతం 1 పాయింట్‌తో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓడిపోవడంతో, ఇప్పుడు పాకిస్థాన్ (Pak Team) గనుక శ్రీలంకపై పైన పేర్కొన్న మార్జిన్‌తో గెలిస్తే, 3 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ ఆధారంగా సెమీ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్థాన్ ఈ సమీకరణాలను అందుకోవడంలో విఫలమైతే లేదా మ్యాచ్ ఓడిపోతే, న్యూజిలాండ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి పాక్ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Read Also: పాక్ కెప్టెన్సీపై అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!